Showing posts with label Spiritual. Show all posts
Showing posts with label Spiritual. Show all posts

13.2.26

శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భ‌క్తిభావం పంచుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు kapileswara swamy





శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యమాలు భ‌క్తిభావాన్ని పంచాయి


ఇందులో భాగంగా సాయంత్రం 5:30 గంటలకు డా||వై .పరమేశ్వరయ్య గాత్రకచేరి భక్తులను అలరించాయిఇందులో " వినాయకాయ...., సురసేనాపతి...., కామాక్షి లోక సాక్షిణి.... " అను కృతులు ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారుతదుపరి 6:30 గంటలకు శ్రీమతి  శైలజ బృందం గణేశ పంచరత్నం...., లింగాష్టకం...., శివాష్టకం....., శివ తాండవ స్తోత్రం... "  వంటి కీర్తనలు  పాడి ప్రేక్షకులను అలరించారు


తరువాత 7:30 నుంచి 8:30 వరకు శ్రీమతి ఇందుమతి  బృందం " పుష్పాంజలి..., నటేశ కౌతం...., భో శంభో...., జతిస్వరం...., దేవీ స్తుతి... ,శంకర శ్రీగిరి నాథ ప్రభో.... " కీర్తనలకు నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది


వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర LAKSHMI KASULA HARAM








తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి వైభవంగా ప్రారంభమైందిశ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని  హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు కార్య‌క్ర‌మంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరిజేఈవోలు శ్రీ వివీర‌బ్ర‌హ్మండాశరత్సివిఎస్వో శ్రీ కేవిమురళీకృష్ణ పాల్గొన్నారు.


 సందర్భంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడసేవ నాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారుశ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు సందర్భంగా టిటిడి నుండి దాదాపు రూ. 6.40 కోట్లు విలువగల 4 కేజీల డైమండ్ మోపుగల 6 పేటల బంగారు యజ్ఞోపవీతము స్వామి వారికి అందించినట్లు తెలిపారు.


ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం తిరుమల ఆలయ పెష్కార్ శ్రీ రామకృష్ణ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు.


 లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామ స్వామిరామచంద్ర పుష్కరిణి మీదుగా మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుందిభజనలుకోలాటాలతో కోలాహలంగా యాత్రసాగిందిభక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.


 సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు


 కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డిశ్రీ పనబాక లక్ష్మీజిల్లా ఎస్పీ శ్రీ ఎల్సుబ్బరాయుడుఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీవిజివోలు శ్రీ రామ్ కుమార్శ్రీ గిరిధర్ఇతర అధికారులుఅర్చకులువిశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.