అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీసౌమ్యనాథ స్వామి వారి ఆలయంలో జూలై 05 నుండి 13వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ చేపట్టారు. ముందుగా సాయంత్రం 6 గంటల నుండి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.
జూలై 05న ధ్వజారోహణం :
జూలై 05వ తేదీ శనివారం ధ్వజారోహణంతో శ్రీ సౌమ్యనాథస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పలు కైంకర్యాలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 - 11.00 గం.ల వరకు సింహలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 05 గం.లకు ఊంజల్ సేవ, రాత్రి 07.00 గం.లకు యాళివాహనం, చతుస్థానార్చనము జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలలో స్వామివారు విహరిస్తారు.
ఆలయ చరిత్ర : శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయ నిర్మాణానికి 11వ శతాబ్ధంలో చోళవంశరాజు కుళోత్తుంగ చోళుడు శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతోంది. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దం వరకు ఆలయం నిర్మాణం కొనసాగి, మట్టిరాజుల కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు రాజగోపురం కట్టింటినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రసిద్ధ వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్ళపాక గ్రామం నందలూరుకు దగ్గరలో ఉన్నందున అన్నమాచార్యుల వారు శ్రీవారిని దర్శించి స్వామివారిపై కీర్తనలు రచించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలో ఎటువంటి దీపం లేకున్నా స్వామివారు ఉదయం నుండి సాయంకాలం వరకు దేదీప్యమానముగా వెలుగొందే విధముగా ఆలయమును నిర్మించడం ఒక అద్భుతం. సంవత్సరంలో ఏదో ఒకరోజు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలపై ప్రసరించే విధముగా శిల్పులు నిర్మించారు.
వాహనసేవల వివరాలు :
తేదీ
05-07-2025
ఉదయం – ధ్వజారోహణం
రాత్రి – యాలి వాహనం
06-07-2025
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హంస వాహనం
07-07-2025
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – సింహ వాహనం
08-07-2025
ఉదయం – పల్లకీ సేవ
రాత్రి – హనుమంత వాహనం
09-07-2025
ఉదయం – శేష వాహనం
రాత్రి – గరుడ వాహనం
10-07-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
11-07-2025
ఉదయం – ఆర్జిత కల్యాణోత్సవం (ఉదయం 10 గంటలకు)
రాత్రి – గజ వాహనం
12-07-2025
ఉదయం – రథోత్సవం (ఉదయం 08 గంటలకు)
రాత్రి – అశ్వవాహనం
13-07-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
జూలై 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 14న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
TTD organised the 128th birth anniversary celebrations of Sri Alluri Sitarama Raju at Annamacharya Kalamandiram, Tirupati on Friday.
Speaking on the occasion, Prof. G. Balasubramanyam from Telugu Department, S.K. University, Anantapur, hailed Alluri as a valiant freedom fighter who fought against British exploitation in the tribal regions.
He emphasized that Alluri sacrificed his life for the downtrodden and that his family leading a humble life without seeking any benefits from his legacy.
TTD Estate Officer Smt. G. Suvarna said Alluri led the armed struggle for tribal rights till his last breath and inspired today's youth to face challenges bravely.
Floral tributes were paid to Alluri's portrait.
Special pujas were performed to the statue of Sri Annamacharya, and the lamp was lit to mark the occasion.
SPW Degree College Telugu HoD Dr Krishnaveni acted as Anchor.
Welfare Dy EO Sri A. Ananda Raju, TTD staff, students and others participated.
మన్యంలో తెల్లదొరల పాలిట సింహస్వప్నం శ్రీ అల్లూరి సీతారామ రాజు అని అనంతపురం ఎస్.కె.యూనివర్శిటీ తెలుగు విభాగం ఆచార్యులు ప్రొ. జి. బాలసుబ్రమణ్యం తెలిపారు. టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శ్రీ అల్లూరి సీతారామ రాజు 128వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన్యం ప్రాంతాలలో తెల్ల దొరల దోపిడిపై అల్లూరి సీతారామ రాజు పోరాటం చేసి యోధుడు అయ్యారని మాట్లాడారు. బడుగు ప్రజల కోసం అల్లూరి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని, అల్లూరి కుటుంబ సభ్యులు సైతం నేటికి సామాన్య జీవితాన్ని గడపుతున్నారని ఆయన గుర్తు చేశారు. అల్లూరి సీతారామ రాజు త్యాగాలను చెప్పుకుని లబ్ది పొందాలనే ఆలోచన అల్లూరి కుటుంబ సభ్యులకు లేదని, కష్టాన్ని నమ్ముకుని బ్రతకాలని, నిరాడంబరంగా జీవితాన్ని గడపడం వారి గొప్పతనానికి నిదర్శనం అన్నారు. అల్లూరి సీతారామరాజులోని ధాదృత్వం, క్షమాగుణం, దేశభక్తి, ఆధ్యాత్మికత, పోరాడేతత్వంను నవతరం ఆకలింపుచేసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా టిటిడి ఎస్టేట్ ఆఫీసర్ శ్రీమతి జి. సువర్ణ మాట్లాడుతూ సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కులకు రక్షణగా ఉంటూ చివరి నిమిషం వరకు పోరాడారని చెప్పారు. అల్లూరి సీతారామ రాజు ఆ రోజుల్లో తప్పని పరిస్థితుల్లో తిరుగుబాటు ధోరణితో హక్కుల కోసం పోరాటం చేశారని, నేటి యువత ఆయనలోని ధైర్యాన్ని మననం చేసుకుని జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాలని సూచించారు.
ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు ధీరత్వంపై పలువురు వక్తలు ప్రసంగించారు.
అంతకుముందు టిటిడి వెల్పేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి అంజలి ఘటించారు. అన్నమయ్య విగ్రహానికి ప్రత్యేక పూజలు హారతులు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి కృష్ణవేణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో (వెల్ఫేర్) శ్రీ ఏ. ఆనందరాజు, పలువురు టిటిడి ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.