31.7.25

ఆగస్టు నెల‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు Tirumala Festivals




తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు నెల‌లో జ‌ర‌గ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.


- ఆగ‌స్టు 2న మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ వ‌ర్థంతి.
- ఆగ‌స్టు 4న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.
- ఆగస్టు 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం.
- ఆగ‌స్టు 7న తిరుమ‌ల శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాలు స‌మాప్తి.
- ఆగ‌స్టు 8న శ్రీ ఆళవందారుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.
- ఆగ‌స్టు 9న శ్రావ‌ణ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.
- ఆగ‌స్టు 10న శ్రీ మలయప్ప స్వామి వారు విఖ‌న‌సాచార్యుల స‌న్నిధికి వేంచేపు.
- ఆగ‌స్టు 16న గోకులాష్ట‌మి ఆస్థానం.
- ఆగ‌స్టు 17న తిరుమ‌ల శ్రీ‌వారి స‌న్నిధిన శిక్యోత్స‌వం.
- ఆగ‌స్టు 25న బ‌ల‌రామ జ‌యింతి, వ‌రాహ‌ జ‌యంతి.

ఆగస్టు 6న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తులసి మహత్యం ఉత్సవం tulasi mahatyam




తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 6వ తేదీ తులసి మహత్యం ఉత్సవం ఘనంగా జరుగనుంది. స్వామివారికి తులసి దళం అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ ద్వాదశినాడు తులసి ఆవిర్భావం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఇందులో భాగంగా ఉదయం 8  నుండి 9.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి వారు గరుడ వాహనాన్ని అధిరోహించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం ఉదయం 9.39 నుండి 10.30 గంటల వరకు బంగారు వాకిలి చెంత స్వామివారి ఆస్థానం ఘనంగా జరుగనుంది. ఇందులో అర్చకులు తులసి మహత్యం పురాణ పఠనం చేస్తారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు.

Dhwajastambha Renovation Works Begins at Tarigonda Temple




The Dhwajasthambham restoration works at the historic Sri Lakshmi Narasimha Swamy Temple in Tarigonda, Annamayya district, commenced on Wednesday with the auspicious Balalayam rituals.


As part of the ceremonies, temple priests performed traditional rituals in the morning, including Chatushtana Archana, installation of Bimba, Kumbha, Kunda, Dwara, Torana, Andarala, Pathaka, and Devatapratishta in accordance with Agama traditions.

In the evening, Nitya Havanam, Dwara Pujas, and Ekanta Seva were scheduled to take place.

On July 31, the programs will continue with Nitya Havanams and Dhwajasthambha Abhishekam in the morning, and Nitya Havanams followed by Ekanta Seva in the evening.

On August 1, the temple will witness the culmination of the restoration rituals with Mahapurnahuti, dismantling of the existing Dhwajasthambha, and Udvasa rituals for Bimba, Kumbha, and Dhwajasthambha, followed by Mahanivedana, all in adherence to scriptural norms.

Temple officials and priests participated.

త‌రిగొండ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌య‌ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం Tarigonda Temple




అన్న‌మ‌య్య జిల్లా త‌రిగొండ‌ శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆలయ ధ్వజస్తంభ జీర్ణోద్ధరణకు సంబంధించి బాలాల‌యం కార్య‌క్ర‌మాలు బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభమ‌య్యాయి.


ఇందులో భాగంగా ఉదయం చతుష్టానార్చన, బింబ, కుంభ, కుండ, ద్వార, తోరణ, అండరాల, పాఠక, దేవతాప్రతిష్ఠ నిర్వ‌హించారు. సాయంత్రం నిత్యహనన ద్వార పూజలు, ఏకాంతసేవ నిర్వహించ‌నున్నారు.

జూలై 31న ఉదయం నిత్యహవనాదులు, ధ్వజస్తంభ అభిషేకం, సాయంత్రం నిత్యహవనాదులు, ఏకాంతసేవ జరుగనున్నాయి.

ఆగ‌స్టు 1వ తేదీన మహాపూర్ణాహుతి, ధ్వజస్తంభ నిర్మూలన, బింబ, కుంభ, ధ్వజస్తంభ ఉద్వాసనలు, మహానివేదన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఆల‌య అధికారులు, అర్చ‌కులు పాల్గొన్నారు.  

Pattabhishekam Mahotsavam Begins at Valmikipuram




The Pattabhisheka Mahotsavams of Sri Pattabhirama Swamy temple at Valmikipuram commenced on Wednesday with religious fervor and grandeur.


As part of the festivities,  Snapana Tirumanjanam was performed in the morning while in the evening, at 6:30 PM, the divine Sri Sitarama Kalyanam was performed in a grand and traditional manner. 

After the Kalyanam, Sri Pattabhirama blessed devotees by parading on the Hanuman Vahanam.

On July 31, Sri Rama Pattabhisheka Mahotsavam, will be observed with traditional rituals. 

In the evening, Unjal Seva will take place at 6 PM, followed by a majestic Garuda Vahanam procession at 8PM. 

Rituals like Maha Purnahuti, Kumbhodvasanam, and Kumbha Prokshanam will be conducted.

Temple officials and priests took part in the event.

శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ అక్రిడిటేషన్ కళాశాల అధ్యాపకులు, సిబ్బందిని అభినందించిన టిటిడి ఈవో




టీటీడీ ఆధ్వర్యంలో తిరుప‌తిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు 2028వ సంవ‌త్స‌రం వ‌ర‌కు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్.బి.ఏ) మంజూరు చేసింది.  


ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు మాట్లాడుతూ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఎం. పద్మావతమ్మ, అధ్యాపకులు, సిబ్బంది సమిష్టి కృషితో పాలిటెక్నిక్ కళాశాలకు నేషనల్ బోర్డ్ అక్రెడిటేషన్ మంజూరు అయ్యేలా పనిచేశారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింతగా కష్టించి జాతీయ స్థాయిలో కళాశాలకు గుర్తింపు తీసుకురావాలని, మరింత నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. 
శ్రీ పద్మావతీ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు ఎన్.బి.ఏ గడవు ముగియడంతో ఎన్.బి.ఏ ప్రతినిధులు గ‌త నెల‌లో కళాశాలలో ఇన్ స్పెక్షన్ నిర్వహించి 2028 వ‌ర‌కు అక్రిడిటేషన్ ఇచ్చారు.

గ‌త నెల‌లో న్యూఢిల్లీ నుండి విచ్చేసిన ఎన్.బి.ఏ నిపుణుల బృందం కళాశాలలోని ప్రయోగశాలలు, అధ్యాపకులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, మౌళిక సదుపాయాలను పరిశీలించారు. కళాశాలలో బోధన, ల్యాబ్స్, లైబ్రరీ, బోధన తదితర అంశాలపై విద్యార్థుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించారు. నేషనల్ బోర్డ్ నిబంధనల మేరకు పాలిటెక్నిక్ కళాశాలను నిర్వహిస్తుండడంతో ఎన్.బి.ఏ మంజూరు అయింది. 

ఈ ఎన్.బి.ఏ అక్రిడిటేషన్‌కు సహకరించిన టిటిడి ఈవో శ్రీ జె శ్యామ‌ల‌రావు, జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, డిఈవో శ్రీ వేంకట సునీల్, కళాశాల బృందానికి ప్రిన్సిపాల్ డా.ఎం. పద్మావతమ్మ ధన్యవాదాలు తెలియజేశారు.

Concrete Policy Document on Ghat Road Vehicle Movement




Keeping in view the day by day increase in Vehicular traffic in Tirumala, the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary has instructed the officials concerned to come out with a concrete Policy Document on Ghat Road Vehicle movement and Traffic plan in Tirumala.


A review meeting with the TTD Transport, Forest, Vigilance and RTA officials was held in the Gokulam Rest House in Tirumala on Wednesday to discuss on various issues related to streamlining traffic on ghat roads and in Tirumala. The Additional EO asked the concerned officials to frame a concrete policy that includes EV Policy, strengthening public transport, sensitizing the private jeep drivers, enforcing the traffic rules in a stern manner to check the increasing environment pollution in Tirumala due to outdated vehicles and many more.

The Additional EO also directed the officials to identify an exclusive parking area for operating a dedicated Prepaid Taxi Facility in Tirumala fixing minimum and maximum rates for the convenience of the pilgrims.

Transport GM Sri Sesha Reddy, TTD Dy CF Sri Phanikumar Naidu,  VGOs Sri Ramkumar, Sri Surendra, District Transport Officer Sri K Murali Mohan and his team of officers were also present.