31.7.25

Sri Krishnaswamy to Bless Devotees on Peddasesha Vahanam




Sri Krishnaswami Temple, the sub-temple in the Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor, will celebrate Gokulashtami on August 16 with traditional religious fervor.


In the morning, Abhishekam and Archana to the of Sri Krishnaswami. 3:00 PM – 4:00 PM: Snapana Tirumanjanam will be performed to the Utsava Murthys at the Mukha Mandapam. Evening: Unjal Seva will be conducted.
   
7:00 PM – 8:15 PM: The Lord will grace devotees on Pedda Sesha Vahanam, parading through the four Mada streets of the temple.  8:30 PM – 9:00 PM: Go Puja followed by Gokulashtami Asthanam will be held.

 On the following day, August 17, Utlotsavam will be observed:

Evening 3:00 PM – 4:00 PM: Snapana Tirumanjanam and Unjal Seva, 6:15 PM – 7:30 PM: Utlotsavam and Asthanam for the deity

Due to these special events, the Sahasra Deepalankara Seva on August 16 stands cancelled, as per TTD.

ఆగష్టు 16న తిరుచానూరు శ్రీకృష్ణస్వామి ఆలయంలో గోకులాష్టమి - పెద్దశేష వాహ‌నంపై శ్రీకృష్ణస్వామి కటాక్షం




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి ఆలయంలో ఆగష్టు 16వ తేదీన గోకులాష్టమి పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.


గోకులాష్టమి రోజున ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహిస్తారు. శ్రీ కృష్ణ‌స్వామి ముఖ మండ‌పంలో మ‌ధ్యాహ్నం 3 నుండి  సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు శ్రీ కృష్ణ స్వామి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ  జ‌రుగ‌నుంది. రాత్రి 7 నుండి 8.15 గంట‌ల వ‌ర‌కు స్వామివారు పెద్దశేష వాహ‌నంపై ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి క‌టాక్షించ‌నున్నారు.

అనంతరం రాత్రి 8.30 నుండి 9 గంటల‌ వరకు గోపూజ‌, గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా  ఆగష్టు 17న ఉట్లోత్స‌వంను పుర‌స్క‌రించుకొని మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, త‌రువాత ఊంజల్‌సేవ జ‌రుగ‌నుంది. సాయంత్రం 6.15 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారికి ఉట్లోత్స‌వం, ఆస్థానం నిర్వహిస్తారు.  

ఈ కార‌ణంగా ఆగష్టు 16న ఆల‌యంలో స‌హ‌స్ర దీపాలంక‌ర‌ణ సేవ‌ను టీటీడీ ర‌ద్ధు చేసింది.

వాల్మీకిపురం శ్రీ పట్టాభి రామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ప్రారంభం - వైభ‌వంగా శ్రీ సీతారాముల‌ కళ్యాణం valmikipuram




వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు బుధ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి.


ఇందులో భాగంగా ఉద‌యం 10 గంట‌ల‌కు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చంద‌నంల‌తో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం వైభ‌వంగా ప్రారంభమైంది. ముందుగా ఆలయ అర్చకులు పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధనం, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధన, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, ముత్యాల త‌లంబ్రాల స‌మ‌ర్ప‌ణ‌, విశేష నివేద‌న‌, మాల‌మార్పిడి, అక్ష‌తారోహ‌ణ‌, హార‌తి, చ‌తుర్వేద పారాయ‌ణం, య‌జ‌మానికి వేద ఆశీర్వాదం, హారతి ఇచ్చారు. కల్యాణం అనంతరం స్వామివారు హనుమంత వాహనంపై  విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.

జూలై 31న ఉదయం యాగశాల పూజ, ఉద‌యం 6.30 గంట‌ల‌కు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఆల‌య అధికారులు, అర్చ‌కులు పాల్గొన్నారు.

Kasyapa Jayanti Observed




At the Jayanti celebrations of Sri Kashyapa Maharshi in Tirumala, scholars stated that books penned by the great sage is the primary authority for Vaikhanasa temple rituals and practices.


They said the text explains temple design, consecration, Vishnu worship, and the spiritual significance of the five elements in detail.

The event, jointly organized by TTD’s Alwar Divya Prabandha Project and Vaikhanasa Sabha at Asthana Mandapam in Tirumala on Wednesday.

Vikhanasa Sabha secretary Sri Srinivasa Deekshitulu, Vikhanasa Trust Secretary Sri Prabhakaracharyulu, TTD Purana Pandit Sri Vakani Ramakrishna Sheshsai, scholars from SV Veda Vijnana Peetham, faculty, students and other eminent scholars.

శ్రీ కశ్యప మహర్షి జ్ఞానకాండ గ్రంథం వైఖ‌న‌స ఆరాధ‌న‌ల‌కు ప్రామాణికం – శ్రీ కశ్యప మహర్షి జయంతి స‌భ‌లో పండితుల ఉద్ఘాట‌న‌






శ్రీ కశ్యప మహర్షి వారు అందించిన జ్ఞానకాండ గ్రంథం అసంఖ్యక వైఖనస ఆలయాలలో నిర్వహించే ఆరాధనలకు అత్యంత ప్రామాణికమ‌ని పండితులు పేర్కొన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ మరియు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వైఖానస మహర్షి శిష్యుల‌లో ఒక‌రైన శ్రీ క‌శ్య‌ప‌ మహర్షి తిరు నక్షత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.


ఈ సంద‌ర్భంగా పండితులు ప్ర‌సంగిస్తూ శ్రీ కశ్యప మహర్షి వారు అందించిన జ్ఞానకాండ గ్రంథం ఆలయ నిర్మాణానికి, భూ పరీక్ష, శంఖు స్థాపన, ఆలయ నిర్మాణ శైలి, మండ‌ప‌ నిర్మాణం, విగ్రహ నిర్మాణం, ప్రతిష్టా విధానాలు వంటి సమగ్రమైన జ్ఞానం సమాజానికి అందించింద‌ని తెలిపారు.

సాకార, నిరాకార ఆరాధన విశేషాలను, విష్ణు పూజా మహిమను, పంచభూతాలైన భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశాలు ప్రశాంతంగా ఏవిధమైన వ్యత్యాసాలు లేకుండా లోకానికి  అనుగ్రహం  అందించే అద్భుత శాంతి విధానాలను సమగ్రంగా జ్ఞానకాండ గ్రంథంలో శ్రీ కశ్యప మహర్షి వారు వివరించారని తెలియ‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ వైఖానస సభ కార్యదర్శి శ్రీ శ్రీనివాస దీక్షితులు, శ్రీ విఖనస ట్రస్టు కార్యదర్శి శ్రీ ప్రభాకరాచార్యులు,  శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ శ్రీ‌నివాస దీక్షితులు, టీటీడీ పురాణ పండితులు శ్రీ వాకాణి రామ‌కృష్ణ శేష‌సాయి, ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర పండితులు పాల్గొన్నారు.

Special Events in August in Sri Kodandarama Swamy Vari Temple




Vontimitta Sri Kodandarama Swamy Temple and Devuni Kadapa Sri Lakshmi Venkateswara Swamy Temple will witness several special religious events in the month of August. The details are as follows:


Vontimitta Sri Kodandarama Swamy Temple:

August 8: Varalakshmi Vratham from 8AM to 10 AM

August 9: Sri Sitarama Kalyanam at 9:30 AM on the occasion of Shravana Purnima

August 23 to 26: Annual Pavithrotsavams

Devuni Kadapa Sri Lakshmi Venkateswara Swamy Temple:

August 8: “Saubhagyam” program organized by Hindu Dharma Prachara Parishad on the occasion of Varalakshmi Vratham

August 9: Tirumanjanam to Sri Venkateswara Swamy along with Sridevi and Bhudevi on the occasion of Sravana Nakshatram

August 18–20: Balalayam and temple renovation works

August 24: Tirumanjanam and Grama Utsavam to Sri Andal Ammavaru on the occasion of Pubba Nakshatram

August 25: Snapana Tirumanjanam and Prakara Utsavam to Sri Padmavathi Ammavaru on the occasion of Uttara Nakshatram

Special Festivals inTirumala in the Month of August



The details of the special festivals to be celebrated in the Tirumala Srivari Temple in the month of August are as follows.


- Matrusri Tarigonda Vengamamba Death Anniversary on August 02.
- Ankurarpanam for the annual Pavitrotsavam on August 04
- Srivari Pavitrotsavams  from August 05 to 07
- Sri Alavandarlu Varsha Tiru Nakshatra on August 08
- Sravana Pournami Garuda Seva on August 09.
- Sri Malayappa visits Vikhanasacharya Sannidhi on August 10
- Gokulastami Asthanam on August 16
- Sikyotsavam on August 17
- Balarama Jayanti and Varaha Jayanti on August 25