అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 2 నుండి 4వ తేదీ వరకు నూతన ధ్వజస్తంభం సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఏప్రిల్ 1న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా ఏప్రిల్ 2న ఉదయం 8 నుండి 11.15 గంటల వరకు వైదిక కార్యక్రమాలు, వాస్తుహోమం, సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు కళాపకర్షణ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3న ఉదయం 8.15 నుండి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు జీవ ధ్వజస్తంభ మహా శాంతి అభిషేకం, పూర్ణాహూతి జరుగనుంది.
ఏప్రిల్ 4న ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు మహా పూర్ణాహూతి, కుంభ ప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

No comments:
Post a Comment