జూన్ 07, 14, 21, 28 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు
జూన్ 11వ తేదీన పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగింపు
జూన్ 25న అమావాస్య సందర్భంగా ఉ. 8.00 గం.లకు సహస్రకలశాభిషేకం, సా. 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగింపు
జూన్ 27న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం 5.30 గం.లకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనం
No comments:
Post a Comment