8.7.25

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ ప్రతిష్ట‌ Kavacha Pratista











తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో జరుగుతున్న జ్యేష్ఠాభిషేకంలో రెండో రోజు సోమవారం కవచప్రతిష్ట‌ వైభవంగా జరిగింది.


జూలై 07వ తేదీ ఆలయంలో ఉద‌యం 08.00 - 10.00 గం.ల వరకు  శ‌త‌క‌ల‌శ‌స్న‌ప‌నం, మ‌హాశాంతి హోమం చేప‌ట్టారు. అనంతరం ఉదయం 10.00 గం.ల నుండి 11.30 గం.ల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అనుగ్రహం, బ్రహ్మోఘోషలను  వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ల‌తో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి కవచప్రతిష్ట‌ చేశారు.

సాయంత్రం 5.30 గం.ల నుండి 6.30 గం.ల వరకు ఉభయ నాంచారులతో శ్రీవారు శ్రీవారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ కె. ముని కృష్ణారెడ్డి,  ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment