శ్రీవారి
తిరుమలలోని రామ్ భగీచా-2 లో ఏర్ పాటు చేసిన మీడియా సెంటర్ లో అశ్వినీ ఆసుపత్రి డిప్యూటీ సివి ల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారి తో కలిసి శుక్రవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీ టీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సిం ఘాల్ ఆదేశాల మేరకు భక్తులకు ఎలాం టి అంతరాయం లేకుండా వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. 50 మంది డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బంది భక్తులకు సేవలందిస్తున్నారని తె లిపారు.
తిరుమలలో సాధారణ రోజుల్లో 10 అం బులెన్స్ లు అందుబాటులో ఉన్నా యని, బ్రహ్మోత్సవాలకు అదనంగా 4 అంబులెన్స్ లను భక్తులకు అత్యా వసర వైద్యం అందించేందుకు అందుబా టులో ఉంచినట్లు చెప్పారు.
మాడ వీధుల్లోని 4 కార్నర్లలో ఒక్కో అంబులెన్స్ ను ఏర్పాటు చే శామని, వాహన సేవ వెనుక మరో అంబు లెన్స్ ఉంటుందని తెలిపారు. గరు డసేవ రోజున మాడవీధుల్లోని కార్ నర్లలో 20 మంది సీనియర్ డాక్టర్ లు, 20 మంది పారా మెడికల్ సిబ్బంది భక్తులకు వైద్యం అందిస్తారని పే ర్కొన్నారు. 2 బ్యాటరీ వాహనాల ద్వారా ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మందులు అందుబాటు లో ఉంటాయని తెలిపారు.
ఈసారి బ్రహ్మోత్సవాల్లో సీనియర్ సిటిజన్ల షెడ్డు వద్ద 12 పడకల ఐసీయూ ఏర్పాటు చేసినట్లు వెల్ లడించారు.
తిరుమలలో అందుబాటులో ఉన్న 12 డి స్పెన్సరీలతో పాటు బ్రహ్మోత్సవా ల్లో భక్తులకు వైద్య సేవలు అందిం చేందుకు అదనంగా ముఖ్యమైన ప్రాం తాల్లో 10 డిస్పెన్సరీలు ఏర్పా టు చేసినట్లు తెలియజేశారు.

No comments:
Post a Comment