శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం తిరుమలలోని నాద నీరాజనం, ఆస్థాన మండపంలో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి.
తిరుమల నాద నీరాజనం వేదికపై ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాలకు చెందిన శ్రీమతి లక్ష్మి సువర్ణ, శ్రీ మల్లేశ్వరరావు, శ్రీ శ్రీనివాసులు, శ్రీ నాగేశ్వరరావు బృందం మంగళ ధ్వని, ఉదయం 5:30 నుండి 6:30 గంటల వరకు ఎస్ వి ఉన్నతవేద విద్యాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో వేద పారాయణం, మధ్యాహ్నం 1.30 గంటల నుండి 2.30 గంటల వరకు విజయవాడకు విజయవాడకు చెందిన శ్రీ సుధాకర్ బృందం గాత్రకచేరి నిర్వహించారు.
ఆస్థాన మండపంలో ఉదయం ఏడు నుండి 8 గంటల వరకు శ్రీమతి వాణి శ్రీ బృందం విష్ణు సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11:30 గంటల వరకు హైదరాబాదుకు చెందిన డాక్టర్ విశ్వనాథ్ బృందం భక్తి సంగీతం, ఉదయం 11:30 నుండి 12.30 గంటల వరకు తాడేపల్లి కి చెందిన డాక్టర్ ఎం.టి.ఆళ్వార్ భక్తి సందేశం ఇచ్చారు.
సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీ మల్లాది సూరిబాబు బృందం అన్నమయ్య సంకీర్తనలు, సాయంత్రం 5.30 నుండి 7 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ రాముడు బృందం హరికథా గానం చేశారు.






No comments:
Post a Comment