7.9.25

శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి పవిత్ర సమర్పణ pavitra samarpanam




కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చ‌న‌ చేపట్టారు. ఆ తరువాత పవిత్ర సమర్పణ నిర్వ‌హించారు. ఇందులో స్వామివారి మూలమూర్తికి, ఉత్సవర్లకు, ఉప ఆలయాలకు, ప‌రివార దేవ‌త‌ల‌కు, విమానప్రాకారానికి, ధ్వజస్తంభానికి పవిత్రాలు సమర్పించారు.
కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో పవిత్ర హోమాలు తదితర వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.
సెప్టెంబర్ 07వ తేదీ ఆదివారం పవిత్ర విసర్జనలు, మహా పూర్ణాహూతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణ, విద్వత్ సంభావన నిర్వహిస్తారు. అనంతరం స్వామివార్లకు, అమ్మవార్లకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment