హైదరాబాద్ జూబ్లీ
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్ లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్ షాబంధనం, అన్నప్రానాయానం నిర్ వహించారు.
ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్ సవర్లకు స్నపన తిరుమంజనం వేడు కగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొ బ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం ఉదయం 11.30 నుండి మధ్యా హ్నం 12.30 గంటల వరకు ఆలయంలో ని మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు.
సాయంత్రం 4 నుండి 5 గంటల వర కు స్వామి, అమ్మవార్లు తిరుచ్చి పై ఆలయ నాలుగు మాడ వీధుల్లో వి హరించనున్నారు. సాయంత్రం 6 నుం డి రాత్రి 8.30 గంటల వరకు యా గశాల వైదిక కార్యక్రమాలు నిర్ వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ వేంకటే శ్వర రెడ్డి, ఏఈవో శ్రీ రమేష్ , టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ నిరంజన్ కుమార్, ఆలయ అర్చకు లు, విశేష సంఖ్యలో భక్తులు పా ల్గొన్నారు.


No comments:
Post a Comment