20.10.25

పూర్ణాహుతితో ముగిసిన జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ప‌విత్రోత్స‌వాలు poornahuti

 


హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టే

శ్వ‌ర‌స్వా
మివారి ఆలయంలో మూడు రోజుల పాటు జ‌రిగిన ప‌విత్రోత్స‌వాలు ఆదివారం పూర్ణాహుతితో ముగిశాయి.

ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి, తోమాల, కొలువు నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ  వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి నిర్వ‌హించారు. అదేవిధంగా కుంభప్రోక్షణ, ఆచార్య బహుమానం అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంతో ప‌విత్రోత్స‌వాలు ముగిశాయి.

ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ వేంక‌టేశ్వ‌ర రెడ్డి, ఏఈవో శ్రీ ర‌మేష్ , టెంపుల్  ఇన్స్పెక్టర్ శ్రీ నిరంజ‌న్ కుమార్‌, ఆల‌య అర్చకులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment