తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా వెలసివున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఆదివారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు.
కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ.
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ దా. మధు సూదన్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment