తిరుమలలో
ని అన్నమయ్య భవన్ లో శుక్రవారం ఉదయం టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 23 మంది భక్తులు తమ సలహాలు, సూచనలు అందించారు.
1. దుర్గా ప్రసాద్, భీమవరం.
ప్రశ్న: ఆన్ లైన్ లో దివ్యాంగులకు, వృద్ధులకు ఒకే స్లాట్ ఇవ్వడంతో టోకెన్లు బుక్ చేసుకోలేకపోతున్నాం. ఆఫ్ లైన్ ద్వారా దివ్యాంగులకు టోకెన్లు కేటాయిస్తే బాగుంటుంది.
ఈవో: అన్ని వర్గాలవారినీ దృష్టిలో పెట్టుకుని ఆన్ లైన్ లో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
2. శ్రీనివాసులు, హైదరాబాద్.
ప్రశ్న: నాది నీరాజనం వేదికపై భారతం, రామాయణం, అన్నమయ్య కీర్తనలను పఠించే కార్యక్రమాలు జరిగేలా చర్యలు తీసుకోండి.
ఈవో: దీనిపై అధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలో నిర్ణయం తీసుకుంటాం.
3. ప్రవీణ్, చిత్తూరు.
ప్రశ్న: స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను తిరుమలలో నిలిపివేశారు. స్వామివారి సేవకు అవకాశం కల్పించండి.
ఈవో: పరిశీలిస్తాం.
4.శర్మ, ఢిల్లీ.
ప్రశ్న: రూ.లక్ష విరాళంగా ఇచ్చిన దాతలకు దర్శనాలు దొరకడం లేదు.
ఈవో: మూడు నెలలు ముందుగా దాతల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేస్తాం.
5. శ్రీనివాస్, చెన్నై.
ప్రశ్న: వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు ఆన్ లైన్ లో దొరకడంలేదు. రూ.300 దర్శన టికెట్లను తగ్గించి ఆ టికెట్లను వృద్ధులు, వికలాంగులకు కేటాయిస్తే బాగుంటుంది.
ఈవో: లక్షలాదిమంది భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కోటాను పెంచుతూ పోతే క్యూలైన్ల నిర్వహణ కష్టతరమవుతుంది. ఎక్కువమంది భక్తులకు మేలు చేసేవిధంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది.
6. రవి, రాజమండ్రి
ప్రశ్న: కరోనా సమయంలో తిరుమలలో గరుడ పురాణం చెప్పారు. దానిని పునరుద్ధరిస్తే బాగుంటుంది.
ఈవో: పరిశీలిస్తాం.
7. శివ శంకర్, విశాఖపట్నం.
ప్రశ్న: టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు గోవిందా అని భక్తులను సంభోదించేలా చర్యలు తీసుకోండి.
ఈవో: ఇప్పటికే అమలు చేస్తున్నాం.
8. సందీప్, వనపర్తి.
ప్రశ్న: గోవింద కోటి రాసిన వారందరి పేర్లను ప్రచారం కల్పిస్తే బాగుంటుంది.
ఈవో: పరిశీలిస్తాం.
9.చంద్రశేఖర్, తిరుపతి.
ప్రశ్న: వైకుంఠ ఏకాదశి దర్శనాల్లో తిరుపతి స్థానికులకు అన్యాయం జరిగింది. చివరి మూడు రోజులు కాకుండా మొదటి మూడు రోజులు దర్శనాలు కల్పించి ఉంటే బాగుంటుంది.
ఈవో: వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు పవిత్రమైనవే. అన్ని రోజులు సమానంగా భావించి స్థానికులు దర్శనం చేసుకోవాలి. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని స్థానికులకు ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతోనే చివరి మూడు రోజుల్లో స్థానికులకు కేటాయించాం. స్థానికులపై చిన్న చూపు లేదు.
10. రామ్ మోహన్, తెలంగాణ.
ప్రశ్న: వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఆన్ లైన్ లో కేటాయించడం చాలా మంచి ఆలోచన. మధ్యాహ్నం సమయంలో శ్రీవారి మెట్టు వైపు చిన్న పిల్లలను అనుమతించడం లేదు. ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అనుమతిస్తే బాగుంటుంది.
ఈవో: శ్రీవారి మెట్టు మార్గంలో వణ్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా భక్తులకు భద్రతా కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం.
11. సువర్ణ, హైదరాబాద్.
ప్రశ్న: అన్న ప్రసాద కేంద్రంలో వృద్ధులతో వెళ్లినప్పుడు వెయిటింగ్ టైమ్ ఎక్కువగా ఉంది. పరిశీలించి చర్యలు తీసుకోగలరు.
ఈవోః పరిశీలించి చర్యలు చేపడతాం.
12. నాగార్జున, నంద్యాల.
ప్రశ్న: గోవిందమాల భక్తులకు కూడా వైకుంఠ ఏకాదశి రోజున దర్శనం చేసుకునే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది.
ఈవో: అన్ని వర్గాల భక్తులను దృష్టిలో పెట్టుకుని పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశాం. గోవిందమాల భక్తులు కూడా జనవరి 2 నుండి 8వ తేది వరకు సర్వ దర్శనంలో స్వామివారిని దర్శించుకోవచ్చు.
13. రాజ్య లక్ష్మి, హైదరాబాద్.
ప్రశ్న: మాకు లక్కీ డిప్ లో అంగ ప్రదక్షిణ టోకెన్లు వచ్చాయి. కానీ మాకు 60 ఏళ్లు కావడంతో అంగ ప్రదక్షిణ చేయగలమా.
ఈవో: స్వామివారి కృపతో మీకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. అంగ ప్రదక్షిణ చేయడం పూర్తిగా మీ వ్యక్తిగతం.
14. ప్రీతి, చెన్నై.
ప్రశ్న: ఆలయంలో దర్శన సమయంలో సిబ్బంది, శ్రీవారి సేవకులు భక్తులను నెట్టేస్తున్నారు. ఏకాదశి రోజున భక్తులందరూ ఉపవాసం ఉంటారు. అందుకు తగినవిధంగా ప్రసాదాలు పంచితే బాగుంటుంది.
ఈవో: భక్తులందరికీ ఎక్కువసేపు స్వామివారిని చూడాలని ఉంటుంది. కానీ స్వామివారి దర్శనం కోసం భక్త
No comments:
Post a Comment