22.12.25

తిరుమలలో పల్స్‌పోలియో pulse polio




దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైందిటిటిడి ముఖ్య వైద్యాధికారి డాక్ట‌ర్ బి.కుసుమ కుమారి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.


తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేద్రాలను ఏర్పాటు చేశారుఇందులో శ్రీవారి ఆలయంతో కలిపి 21 ప్రాంతాలలో భక్తులకు, 4 ప్రాంతాలలో స్థానికులకు ఏర్పాటు చేశారుఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు మరియు స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా ల్స్‌పోలియో చుక్కలు వేయించుకోవాలని ముఖ్య వైద్యాధికారి కోరారు.


కాగా అశ్విని ఆసుపత్రిజియన్‌సిఆర్‌టిసి బస్టాండ్‌సిఆర్‌పిఏసి 1 మరియు 2, ఎమ్‌బిసి-34, వైకుంఠం 1 మరియు 2, హెల్త్‌ ఆఫీసుఎటిసిమేదరమిట్టవరాహస్వామిరాంభగీఛ అతిధి గృహలవద్శ్రీవారి ఆలయం లోపలకల్యాణకట్టబాలాజీ నగర్టిటిడి ఉద్యోగుల డిస్పెన్సరి ఎస్‌.విహైస్కూల్‌పాపావినాశనంఅలిపిరి కాలినడక మార్గంలో పల్స్‌ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారుఅన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 2129 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు.


 కార్యక్రమంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్.కుసుమకుమారిఅశ్వినీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డితిరుపతి సెంట్రల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుహర్లతఅశ్వినీ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి కృష్ణ కుమారిఇతర డాక్టర్లుపారా మెడికల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

No comments:

Post a Comment