30.12.25

వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్లు ప‌రిశీలించిన టీటీడీ చైర్మ‌న్‌ ttd chairman







తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30 వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా టీటీడీ చేసిన ఏర్పాట్ల‌ను సోమ‌వారం సాయంత్రం టీటీడీ చైర్మ‌న్ శ్రీ బీ.ఆర్‌.నాయుడు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారుముందుగా గోగ‌ర్భం డ్యామ్ స‌ర్కిల్ వ‌ద్ద‌కు చేరుకున్న చైర్మ‌న్ భ‌క్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లుస‌దుపాయాల‌పై ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.


అనంత‌రం శిలాతోర‌ణంకృష్ణ‌తేజ విశ్రాంతి గృహాల వ‌ద్ద ఏర్పాటు చేసిన SSD టోకెన్ల త‌నిఖీ కేంద్రంలో త‌నిఖీ ప్ర‌క్రియ‌ను ప‌రిశీలించి భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా అన్ని ప్ర‌ణాళికబ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.


 సంద‌ర్భంగా చైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల‌లో భ‌క్తుల కోసం అన్ని ఏర్పాటు సిద్ధం చేయ‌డం జ‌రిగింద‌న్నారుభ‌క్తులంద‌రికీ సౌక‌ర్య‌వంతంగా ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఏర్పాట్లు చేప‌ట్టిన‌ట్లు తెలిపారుపోలీసులువిజిలెన్స్టీటీడీ యంత్రాంగం స‌మ‌న్వ‌యంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తుల ర‌ద్దీని ప‌ర్య‌వేక్షిస్తూ వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలియ‌జేశారు.


 కార్య‌క్ర‌మంలో ఈవో వెంట టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీమ‌తి ప‌న‌బాక ల‌క్ష్మీశ్రీ న‌రేష్‌సీవీఎస్వో శ్రీ ముర‌ళీకృష్ణ‌తిరుప‌తి ఎస్పీ శ్రీ సుబ్బ‌రాయుడుశ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథంఇత‌ర అధికారులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment