టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీక నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 179వ ఆరాధన ఉత్సవం జరుగుతోంది. శ్రీ ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆవరణంలోని ఓపెన్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 7.30 గం.ల నుండి జనవరి 08వ తేదీ ఉదయం 8 గం.ల వరకు 24 గంటల పాటు అఖండ సంగీత నీరాజనం కార్యక్రమం జరుగనుంది.
ఈ సందర్భంగా ఉదయం 7.30 గం.లకు నాదస్వర డోలు కచేరీ అనంతరం శ్రీ త్యాగరాజస్వామి వారికి పంచామృత అభిషేక కార్యక్రమం, ఘనరాగ పంచరత్న కీర్తనల బృందగానం నగరంలోని సంగీత విద్వాంసులు కళాశాల అధ్యాపక బృందం సంయుక్తంగా నిర్వహించారు. అనంతరం సంగీత విద్వాంసులు, సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, కళాశాల మరియు నాదస్వర డోలు పాఠశాలలోని అధ్యాపక ఉపాధ్యాయ బృందం వారికి కేటాయించిన సమయానికి గాత్ర , వాద్య సంగీత కచేరీలు ఆధ్యంతం భక్తి శ్రద్ధలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉదయం 8.50 గం.ల నుండి 10.30 గం.ల వరకు శ్రీ త్యాగరాజ విరచిత ఘనరాగ పంచరత్న కృతులు బృందగానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
24 గంటల అఖండ సంగీత నీరాజనం కార్యక్రమం గురువారం ఉదయం 7:30 గంటలకు వరకు నిర్వహించి, అనంతరం శ్రీ ఆంజనేయ ఉత్సవం మరియు మహా మంగళహారతి కార్యక్రమంతో పరిసమాప్తి అవుతుందని ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ఉమా ముద్దుబాల తెలిపారు.





No comments:
Post a Comment