తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరుగనున్నాయి.
ప్రతి ఏడాదీ ఆలయంలో అధ్యయనోత్సవాల సందర్భంగా దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో సేవాకాలం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, అర్చకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment