సంక్రాంతి
పండుగని పురస్కరించుకుని నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి నివాస గృహంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గురువారం ఉదయం టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జి.భానుప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బారాయుడు, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, వేదపండితులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment