8.1.26

అతిథులను గౌరవించడంలో భారతీయులు ముందంజ development in mauritius




సంస్కృతిసంప్రదాయంఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్ ప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు  దేశాధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ తెలియజేశారు.


తిరుమలలోని ధర్మగిరిలో ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని బుధవారం ఉదయం మారిషస్ దేశాధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ సందర్శించారుముందుగా వేద విజ్ఞాన పీఠం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మరియు వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.


అనంతరం వేద పాఠశాలలోని ఆనంద నిలయంలో శ్రీవేంకటేశ్వర స్వామిశ్రీ గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని మారిషస్ దేశాధ్యక్షుడికి స్వాగతోపాన్యాసం చేశారు. 


అనంతరం వేద పాఠశాల అధ్యాపకులువిద్యార్థులు సామూహిక వేద పారాయణం నిర్వహించారు సందర్భంగా ప్రిన్సిపాల్ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం చరిత్రను మారిషస్ దేశాధ్యక్షుడికి వివరించారు.


అనంతరం మారిషస్ దేశాధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ మాట్లాడుతూ తాను అధ్యాపక వృత్తి నుండి మారిషస్ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని తెలిపారుసమాజంలో పాధ్యాయులకు ఎనలేని గౌరవం ఉందనిఆధునిక సమాజ అభివృద్ధికి ఉపాధ్యాయులు తోడ్పడతారని పేర్కొన్నారు.


ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారువసుదైక కుటుంబకమైన భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సాంస్కృతికసాంప్రదాయఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చెందుతోందని చెప్పారుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని మారిషస్ దేశాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు.


అతిథులను గౌరవించడంలోస్వాగతం పలకడంలో భారతీయులు ముందంజలో ఉంటారని చెప్పారుమారిషస్ దేశంలో నిర్మిస్తున్న హరిహర దేవస్థానంలో టీటీడీ సలహాలుసూచనలతో వేద పాఠశాల ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు.


అనంతరం వేద పండితులు మారిషస్ దేశాధ్యక్షుడికి వేదాశీర్వచనం అందించగా టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మరియు వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని ఘనంగా సత్కరించి శ్రీవారి చిత్రపటం అందజేశారు.

No comments:

Post a Comment