మారిషస్
గౌరవ అధ్యక్షుడు శ్రీ ధరమ్ బీర్ గోగుల్ మంగళవారం సాయంత్రం తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న మారిషస్ అధ్యక్షుడికి టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం పూర్తయ్యాక శ్రీ ధరమ్ బీర్ గోగుల్ గారికి టిటిడి జేఈవో తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, సివిఎస్వో శ్రీ కె.వి.మురళీకృష్ణ, పలువురు టిటిడి అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment