13.1.26

ముత్తంగి అలంకారంలో శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం sri govindaraja




తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో పవిత్ర ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామివారి మూలమూర్తిని ముత్యాలతో అలంకరించారుముత్యాలతో అలంకరించబడిన స్వామివారిని దర్శించిన భక్తులు తన్మయత్వం చెందుతున్నారు


ప్రతి ఏడాది ధనుర్మాసంలో స్వామివారు నెలరోజులపాటు ముత్తంగి అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు.  జనవరి 17 తేదీ వరకు స్వామివారు ముత్తంగి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు


ఆకుతోట వీధికి శ్రీ ఆండాళ్ అమ్మవారు 


శ్రీ గోవింద రాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయంలో జనవరి 6 తేదీ నుండి నీరాటోత్సవం నిర్వహిస్తున్న విషయం విధితమేఇందులో భాగంగా సోమవారం శ్రీ ఆండాళ్ అమ్మవారు తిరుపతిలోని ఆకుతోట వీధిలోని పురాతన శ్రీకృష్ణ స్వామి వారి ఆలయానికి వేంచేపు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


భక్తుల కోరిక మేరకు టీటీడీ 15 సంవత్సరాల తర్వాత  కార్యక్రమాన్ని పునరుద్ధరించింది


 కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ శ్రీమతి శాంతిఏఈఓ శ్రీ నారాయణ చౌదరిఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment