9.1.26

నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిని వేగంగా పూర్తి చేయాలి - టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్- ttd eo inspected children hospital








అలిపిరి సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్నివేగంగా పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు.   శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంనునిర్మాణంలో ఉన్న నూతన భవనాన్ని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులుఇంజనీరింగ్ అధికారులతో కలిసి టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గురువారం పరిశీలించారు.  


 సందర్బంగా ఈవో మాట్లాడుతూనూతన ఆసుపత్రి భవనం పూర్తి అయ్యే సమయానికి భవనానికి అవసరమయ్యే మానవ వనరులుఆపరేషన్ యంత్రాలుర్నీచర్విద్యుత్ , తదితర మౌళి సదుపాయాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారుకొత్తగా నిర్మిస్తున్న జీ + 6 నూతన ఆసుపత్రి భవనంలో వైద్య సేవలుపరిపాలన కోసం ఒక్కొక్క ఫ్లోర్ లో   అంతస్తును ఉపయోగిస్తున్నారనిప్రతి ఫ్లోర్ ను పరిశీలించారు. 6 ఫ్లోర్ లో పూర్తిగా ఆపరేషన్  కోసం వినియోగించనున్నట్లు, 7 ఫ్లోర్ కేవలం హెలిపాడ్ కోసం ఉపయోగించనున్నట్లు వైద్యులు డా. ఎన్శ్రీనాథ్ రెడ్డి వివరించారుఆసుపత్రిలో అక్కడక్కడా భక్తిభావంమనోధైర్యాన్ని రోగులకు, వారి సంరక్షకులకు నింపేలా ఆసుపత్రి గోడలకు దేవతామూర్తుల చిత్రాలను అమర్చాలనిపరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారుఆసుపత్రి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి వీలైనంత త్వరగా నూతన ఆసుపత్రిని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


అంతకుముందు శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో పరిశీలించారు సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవఎస్వీ ప్రాణదా ట్రస్ట్   ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో టిటిడి ఈవో మాట్లాడి  ఆన్ లైన్ నమోదుతదితర అంశాలపై పలు సూచనలు చేశారుముందుగా ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారుఅటు తర్వాత గుండె సంబంధ శస్త్ర చికిత్సలు చేసుకున్న అనంతపురంప్రొద్దుటూరుచిత్తూరుకాకినాడతెనాలిరాయచోటికర్నూలు తదితర ప్రాంతాలకు చెందిన చిన్నారులువారి సంరక్షకులతో మాట్లాడారువైద్య సేవలు ఎలా ఉన్నాయిఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయాఉచితంగా మందులు అందిస్తున్నారా తదితర అంశాలను పిల్లల సంరక్షకులను అడిగి తెలుసుకున్నారుశ్రీపద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి అందిస్తున్ వైద్యసేవలపై చిన్నపిల్లల సంరక్షకులు సంతృప్తి వ్యక్తం చేశారుకర్నూలుకు చెందిన భరత్ కు గుండె మార్పిడి చికిత్స చేసినట్లు ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ ఎన్శ్రీనాథ్  రెడ్డి టిటిడి ఈవోకు వివరించారుఇప్పటి వరకు 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు,  23 గుండె మార్పిడి చికిత్సలు నిర్వహించినట్లు వైద్యులు వివరించారు.


అనంతరం ఐసియూ - 1లోని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో గుండెకు ఉన్న రంద్రాలను సరిచేసే క్యాత్ ల్యాబ్ మిషన్ నుసియూ -2లోని ఐసోలేషన్ గదినిఐసియూ - 3, జనరల్ వార్డులలో చికిత్స పొందిన చిన్నారులను పరిశీలించారుశ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలం అందిస్తున్న సేవలను పిల్లల సంరక్షకులతో మాట్లాడారుకడపకు చెందిన 3 నెలల చిన్నారి కిషోర్ కు మంచి రక్తంచెడు రక్తం గుండెలో వేర్వేరుగా వెళ్లాల్సి ఉండగాఒకేచోట కలుస్తుండడంతో శస్త్ర చికిత్స చేసి మంచి రక్తంచెడు రక్తం వేర్వేరుగా వెళ్లేలా వైద్యం చేసినట్లు వెల్లడించారు.


 కార్యక్రమంలో సీఈ శ్రీ టి వి సత్యనారాయణఎస్ఈ శ్రీ వేంకటేశ్వర్లుశ్రీ మనోహరంచిన్న పిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి ఆర్.ఎం.వో డా.భరత్వైద్యులుతదితర ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment