కడప
జిల్లా, దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో జనవరి 19 నుండి 27 వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో ఏర్పాట్లపై టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జనవరి 18వ తేదీ సాయంత్రం 6 గం.లకు అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని జేఈవో ఆదేశాలు ఇచ్చారు. 24వ తేదీ ఉదయం 10.30 గం.లకు స్వామి వారి కల్యాణం, 25వ తేదీ రథోత్సవంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని సూచించారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
19.01.2026 ఉదయం – ధ్వజారోహణం (మీన లగ్నం) రాత్రి – చంద్రప్రభ వాహనం
20.01.2026 ఉదయం – సూర్యప్రభవాహనం రాత్రి – పెద్దశేష వాహనం
21.01.2026 ఉదయం – చిన్నశేష వాహనం రాత్రి – సింహ వాహనం
22.01.2026 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – హనుమంత వాహనం
23.01.2026 ఉదయం – ముత్యపుపందిరి వాహనం రాత్రి – గరుడ వాహనం
24.01.2026 ఉదయం – కల్యాణోత్సవం రాత్రి – గజ వాహనం
25.01.2026 ఉదయం – రథోత్సవం రాత్రి – ధూళి ఉత్సవం
26.01.2026 ఉదయం – సర్వభూపాల వాహనం రాత్రి – అశ్వ వాహనం
27.01.2026 ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, వీజీవో శ్రీ గిరిధర్, టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, ఆలయ అర్చకులు శ్రీ మయూరం కృష్ణ స్వామి, అర్చకులు, టీటీడీ అధికారుల, స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment