VIDEO
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జన వరి 28 న ప్రారంభమైన అధ్యయనోత్ సవాలు మంగళవారం ఘనంగా ముగిశా యి . ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యే క కార్యక్రమాలు నిర్వహించారు .
ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుంచి శ్రీ గోవిందరాజ స్వామివా రు, శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్ రీ విష్వక్సేనులవారు, శ్రీరా మానుజాచార్యులు, శ్రీ నమ్మాళ్ వార్, శ్రీ కూరత్తాళ్వార్, శ్రీ తిరుమంగైయాళ్వార్ ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమైంది. తిరు పతి వీధుల గుండా కపిలతీర్థాని కి చేరుకున్న అనంతరం అక్కడ తిరు మంజనం, ఆస్థానం నిర్వహించారు. అ క్కడినుంచి బయల్దేరి పిఆర్ గా ర్డెన్ మీదుగా మధ్యాహ్నం తిరి గి ఆలయానికి చేరుకుంది.
సాయంత్రం 6.30 గంటలకు శ్రీ గో విందరాజస్వామివారి ఆలయంలో తి రుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీ యర్ స్వామివారికి గజ మాలతో మ ర్యాద జరిగింది. అనంతరం సన్ నిధిలో స్వామి, అమ్మవార్లకు ఆ స్థానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్ రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆ లయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాం తి, ఏఈవో శ్రీ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment