13.2.26

వైభవంగా ఆండాళ్‌ అమ్మవారి మాలల ఊరేగింపు ammavari maalalu





శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం రాత్రి 7 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు దయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్‌ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు.


గోదా కల్యాణయాత్ర పేరిట నిర్వహించే  యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యాత్ర శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైందిఆలయం నుండి ఎస్వీ గోసంరక్షణశాలతాటితోపుపెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది.


భక్తజన బృందాలు చెక్కభజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళవాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నది.


అనంతరం అర్చకులు శాస్రోక్తంగా ఆండాళ్‌ అమ్మవారి మాలలను శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్‌కు అలంకరించారుఅనంతరం రాత్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో  మాలలను స్వామివారికి

అలంకరించనున్నారు.


 కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్  స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామిస్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మీశ్రీమతి శాంతిఏఈవో శ్రీ గోపినాథ్ఇతర ఉన్నతాధికారులుఆధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


ఫిబ్రవరి 13 స్వర్ణ రథోత్సవం


శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన శుక్రవారం స్వర్ణ రథోత్సవం వైభవంగా జరుగనుందిసాయంత్రం 4 నుండి 5 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారురాత్రి 8 నుండి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.


No comments:

Post a Comment