తిరుపతిలోని
శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం రాత్రి శ్రీ సోమస్కంధమూర్తి అశ్వ వాహనంపై భక్తులను అనుగ్రహించారు. భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియ నియామకుడు. స్వామి అశ్వవాహనాన్ని అధిష్టించి కలిదోషాలకు దూరంగా ఉండాలని, నామ సంకీర్తనాదులను ఆశ్రయించి తరించాలని ప్రబోధిస్తున్నారు.
వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఇతర అధికారులు, అర్చకలు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment