3.2.26

శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల ప్రోగ్రాం బుక్ లెట్లను ఆవిష్కరించిన టీటీ చైర్మన్ book let




శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16 తేది వరకు జరగనున్న వార్షి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రోగ్రాం బుక్ లెట్ లను తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆవిష్కరించారు.


 కార్యక్రమంలో టీటీడీ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీమతి వర లక్ష్మీ పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :


తేదీ

08-02-2026


ఉదయం – ధ్వజారోహణం ( కుంభ ల‌గ్నం. 8.15 నుండి 8.35 గంటల వరకు)


రాత్రి – పెద్దశేష వాహనం


09-02-2026


ఉదయం – చిన్నశేష వాహనం


రాత్రి – హంస వాహనం


10-02-2026


ఉదయం – సింహ వాహనం


రాత్రి – ముత్యపుపందిరి వాహనం


11-02-2026


ఉదయం – కల్పవృక్ష వాహనం


రాత్రి – సర్వభూపాల వాహనం


12-02-2026


ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)


రాత్రి – గరుడ వాహనం


13-02-2026


ఉదయం – హనుమంత వాహనం


మధ్యాహ్నంవసంతోత్సవం (. 2 నుండి 3 గంటల వరకు)


సాయంత్రం – స్వర్ణరథం(సా. 4 నుండి 5 గంటల వరకు)


రాత్రి – గజ వాహనం


14-02-2026


ఉదయం – సూర్యప్రభ వాహనం


రాత్రి – చంద్రప్రభ వాహనం


15-02-2026


ఉదయం – రథోత్సవం


రాత్రి – అశ్వవాహనం


16-02-2026


ఉదయం – చక్రస్నానం(. 9.55 నుండి 10.15 గంటల వరకు)


రాత్రి – ధ్వజావరోహణంసా. 6 నుండి రాత్రి 7 గంటల వరకు)

No comments:

Post a Comment