తిరుపతిలో
నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవనాన్ని టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ పరిశీలించారు. టిటిడి సాంకేతిక సలహాదారు శ్రీ ఆర్. కొండల రావుతో కలిసి నిర్మాణంలోని భవనాన్ని బుధవారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జేఈవో డా. శరత్ మాట్లాడుతూ, చిల్డ్రన్స్ ఆసుపత్రి నూతన భవనాన్ని నిర్ధిష్ట సమయాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా జరుగుతుండడంపై ఆయన సంబంధించిన అధికారులను ప్రశ్నించారు. టిటిడి ఇంజనీరింగ్ టెక్నికల్ అడ్వైజర్ సూచనల మేరకు పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలు చుట్టూ పచ్చదనం, ఆసుపత్రి లోపల ధైవభక్తి, మనోదైర్యం నింపేలా దేవాతామూర్తుల ఫోటోలను, నిత్యం పర్యవేక్షించేలా సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆసుపత్రి భవనానికి అవసరమైన ఎలక్ట్రికల్ తదితర మౌళిక సదుపాయాల పరికరాల ఎంపికలో మరింత నాణ్యమైన వస్తువులను ఉపయోగించాలని కోరారు. నూతన భవనానికి సంబంధించి జరుగుతున్న పనులపై ఆసుపత్రి ముందు శాఖల వాారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ టి.వి. సత్యనారాయణ, ఆసుపత్రి డైరెక్టర్ డా. ఎన్. శ్రీనాథ్ రెడ్డి, ఆర్ ఎంవో డాక్టర్ భరత్, ఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment