16.2.26

మహాశివ రాత్రిలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్నిపెంచిన భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు maha sivaratri










మహాశివ రాత్రిలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ని మ‌రింత పెంచేలా ఆదివారం టీటీడీ ప‌లు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది.


ఇందులో భాగంగా తిరుపతిలోని కపిలతీర్థంమహతి కళాక్షేత్రంఅన్నమాచార్య కళామందిరంరామచంద్ర పుష్కరిణిలో టీటీడీ హిందూ ధ‌ర్మ ప్ర‌చార‌ప‌రిష‌త్ఎస్వీ సంగీత నృత్ కళాశాలఅన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.


కపిలతీర్థంలో....  


కపిలతీర్థంలో శ్రీ‌మ‌తి ప్రసన్న లక్ష్మీ బృందం శివస్తోత్ర పారాయణంశ్రీ ఆముదాల మురళి పురాణ ప్రవచనంశ్రీ జగదీష్ బృందం లింగోద్భవ వైభవం నృత్య రూపకంశ్రీ వేంకటేశ్వర్లు సతీ తులసి హరికథసంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శి భజనామృతం భ‌క్తుల‌లో మ‌రింత భ‌క్తి భావాన్ని పెంచాయి.


మహతి క్షేత్రంలో....


మహతి క్షేత్రంలో శ్రీ‌మ‌తి సరళ బృందం శివస్తోత్ర పారాయణంశ్రీ ప్రభాకర్ శర్మ పురాణ ప్రవచనంశ్రీ హరనాథ్ నేతృత్వంలో మోహినీ భస్మాసుర నృత్య రూపకంశ్రీ‌మ‌తి జయంతి సావిత్రి ఆధ్వర్యంలో క్త శిరియాళ హరికథసంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శివ భజనామృతం నిర్వ‌హించారు.


అన్నమాచార్య కళామందిరంలో....


అన్నమాచార్య కళామందిరంలో శ్రీ‌మ‌తి ఇందిరా రాణి బృందం శివస్తోత్ర పారాయణంశ్రీ‌మ‌తి నిర్మలా బాయ్ పురాణ ప్రవచనంశ్రీ‌ అజయ్ కుమార్ బృందం పార్వతి పరిణయం నృత్య రూపకంశ్రీ‌మ‌తి కృష్ణ కుమారి పార్వతి పరిణయం హరికథసంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శి భజనామృతం పుర‌ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నాయి.


రామచంద్ర పుష్కరిణి.....


రామచంద్ర పుష్కరిణి వ‌ద్ద శ్రీ‌మ‌తి రాజకుమారి బృందం శివస్తోత్ పోరాయణంశ్రీ నారాయణ రావు పురాణ ప్రవచనంశ్రీ కిషోరి బోస్ బృందం శివ లీలలు నృత్య రూపకంశ్రీ రాముడు బృందం భక్త కన్నప్ప హరికథసంప్రదాయ పాఠశాల విద్యార్థినులు శివ భజనామృతం అల‌రించాయి.


No comments:

Post a Comment