12.2.26

మకర వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి స‌మేత కామాక్షి అమ్మవారు makara vahanam







తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారుభజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగింది.


మకరం గంగాదేవికి నిత్యవాహనంగం పరమశివుని శిరస్సుపై నివసిస్తోందిగంగాదేవి వాహనమైన మకరం పమాచరించి శివానుగ్రహాన్ని పొంది  పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయిమకరం జీవప్రకృతికి ఉదాహరణభగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు.


అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారుశ్రీ సోమస్కందమూర్తిశ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలుపెరుగుతేనెపండ్లరసాలుచందనంతో అభిషేకం చేశారు.


 కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ కె.పి.చంద్రశేఖర్ , టెంపుల్ ఇన్స్ పెక్టర్లు శ్రీ దామోద‌ర్‌శ్రీ రవికుమార్ఆల‌య అర్చ‌కులు,  విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment