తిరుపతి
శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం రోజైన ఆదివారం రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు.
భజనమండళ్ల కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో సాయంత్రం 6 గంటల నుండి వాహనసేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మహావిష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.
లింగోద్భవకాల అభిషేకం…
ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
వాహన సేవలో టీటీడీ సివిఎస్వో శ్రీ కే.వి.మురళికృష్ణ, ఆలయ ప్రత్యేకాధికారి శ్రీ డి.ఫణికుమార్ నాయుడు, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment