10.2.26

సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి క‌టాక్షం surya prabha vahanam







తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన సోమ‌వారం ఉదయం 7 గంట‌ల‌కు శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై క‌టాక్షించారుభజనమండళ్ల కోలాటాలుభజనలుమంగళవాయిద్యాల నడు పురవీధుల్లో వాహనసేవ కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.


చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడుసూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైందిమయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తిభక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నారు.


అనంతరం శ్రీ స్కోమస్కందమూర్తిశ్రీకామాక్షి దేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం ఘనంగా జరిగిందిఇందులో పాలుపెరుగుతేనెపండ్లరసాలుచందనంతో అభిషేకం చేశారు.


వాహ‌న‌సేవ‌లో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌ఆల‌య అర్చ‌కులుఇత‌ర అధికారులువిశేషంగా భక్తులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment