15.2.26

"అయిగిరి నందిని..., సాంబశివాయనవే..., మయాతీత స్వరూపిణి..." కపిలతీర్థంలో ఆకట్టుకున్న ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకుల వాయిద్య విన్యాసం sv music college students






శ్రీ కపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ‌నివారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేదికపై ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు మ‌రియు విద్యార్థుల భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలు భ‌క్తుల‌ను మైమ‌రిపించాయి.


ఇందులో బాగంగా సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు వేణు కచేరిలో శ్రీ చెన్నయ్య బృందం "శ్రీ విఘ్నరాజం జే...,  సాంబశివాయనవే... , శోభిల్లు..., మయాతీత స్వరూపిణిఅయిగిరి నందిని..., " వంటి కీర్తనలు ఆలపించి భ‌క్తులను ఆకట్టుకున్నారుతదుపరి సాయంత్రం 6:30 గంట‌ల నుండి  గాత్ర కచేరీలో "శ్రీమతి జి.చిన్నమ్మ దేవి బృందం శ్రీ మహా గణపతే... , పరమేశ్వర జగదీశ్వర...., పార్వతీ నినునే నెరనమ్మితి..., పురహర నందన...., " వంటి కృతులు పాడి  అలరించారు.


త‌రువాత రాత్రి 7:30 గంట‌ల నుండి నృత్య ప్రదర్శనలో భాగంగా కళాశాల పూర్వపు విద్యార్థులు శ్రీ బాలాజీ బృందం నృత్య ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు.

No comments:

Post a Comment