24.2.26

ఎంప్లాయిమెంట్ జనరేట్ చేసే స్థాయిలో శిక్షణ ఉండాలి – టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ ttd jeo (h&e)








తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు ఉద్యోగావకాశాలు సృష్టించే స్థాయిలో నాణ్యమైన శిక్షణ అందించాలని టిటిడి జేఈవో (వైద్యం విద్యడాశరత్ అధ్యాపకులకు సూచించారుసోమవారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి కళాశాలను పరిశీలించారు.


 సందర్భంగా జేఈవో మాట్లాడుతూవిద్యార్థినుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కెరీర్ గైడెన్స్నాణ్యమైన ఫలితాలుఉపాధి అవకాశాల సాధన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారుపాలిటెక్నిక్ కళాశాల కావడంతో సాంకేతిక నైపుణ్యాభివృద్ధి (టెక్నికల్ స్కిల్స్పై మరింత శ్రద్ధ అవసరమని తెలిపారుతరచూ కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థినుల్లో ప్రేరణఆత్మవిశ్వాసం పెంపొందుతాయని చెప్పారు.


విద్యార్థినుల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలంటే అధ్యాపకులు సమిష్టిగా కృషి చేయాలనినాణ్యమైన ఫలితాలు సాధించేందుకు కట్టుబడి పనిచేయాలని సూచించారుఉత్తీర్ణత శాతం తగ్గితే సంబంధిత అధ్యాపకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


అంతకుముందు జేఈవో కంప్యూటర్ ల్యాబ్లైబ్రరీప్రాక్టికల్ ల్యాబ్‌లుతరగతి గదులను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటించారుమైండ్ అటెన్షన్‌తో చదువుకుంటేనే ఉన్నత స్థాయి కెరీర్ సాధ్యమవుతుందని వారికి సూచించారుటిటిడి నుంచి పూర్తి సహకారం అందుతోందనిఅందుకు తగిన విధంగా ప్రతిభను కనబరచాలని విద్యార్థినులను కోరారు.


అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించి కళాశాలలో ఉన్న లోటుపాట్లను తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.


 కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాఎంపద్మావతమ్మఅదనపు హెల్త్ ఆఫీసర్ డాసునీల్ఈఈ శ్రీ ప్రసాద్డీఈ శ్రీమతి సరస్వతిఅధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


No comments:

Post a Comment