విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు శ్రీ త్రిపురనేని వెంకటరత్నం, శ్రీమతి మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.
అదేవిధంగా ఆయన కుమారులు శ్రీ త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ లు కూడా శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాతల ప్రతినిధి శ్రీ పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
No comments:
Post a Comment