16.3.26

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పుష్పయాగానికి అంకురార్పణ ankurarpanam




శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మార్చి 15 జరుగనున్న పుష్పయాగానికి శ‌నివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.


సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పుణ్యాహ‌ వ‌చ‌నంమృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వంఅంకురార్పణం చేపట్టారు.


మార్చి 15న‌ ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారుఇందులో పాలుపెరుగుతేనె,  పసుపుచందనంకొబ్బరినీళ్ల‌తో అభిషేకం చేస్తారుమధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరుగనుందిఇందులో తులసిచామంతిగన్నేరుమొగలిమల్లెజాజి సంపంగిరోజాకలువలు వంటి లురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.


బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులుఅధికార అనధికారులుభక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు రిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు యాగం నిర్వహణ వల్ల సమస్తదోషాలు తొలగిపోతాయని విశ్వాసం.


శ్రీవారి పుష్పయాగాన్ని పురస్కరించుకుని మార్చి 15 నిత్య కల్యాణోత్సవం సేవను టీటీడీ రద్దు చేసింది.


 కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మిసూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ ముని శంక‌ర్‌శ్రీ ధ‌న‌శేఖ‌ర్‌ పాల్గొన్నారు

No comments:

Post a Comment