తిరుమల లోని ఔటర్ రింగ్ రోడ్డులో కృష్ణ తేజ అతిథి భవనం సమీపంలోని క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో ఇరువురు భక్తులు పరస్పర ఘర్షణ కు దిగిన సంఘటన సోమవారం నాడు చోటు చేసుకుంది.
అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది మరియు శ్రీవారి సేవకులు వెంటనే అప్రమత్తం కావడంతో ఘర్షణను నిలువరించారు.
శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు ఈ విధంగా పరస్పర ఘర్షణకు దిగడం సమంజసం కాదని, ఓర్పుతో, సహనంతో వ్యవహరిస్తూ తోటి భక్తులతో స్నేహ పూర్వకంగా ఉండాలని ,అదేవిధంగా క్యూలైన్ నియమాలను తప్పనిసరిగా పాటించి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా టిటిడి విజ్ఞప్తి చేస్తోంది.
No comments:
Post a Comment