20.3.26

స్వర నాదాలు, నాట్య భంగిమలతో భక్తి మాధుర్యం పంచిన కళాకారులు dance performance







శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజుగురువారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసి సాంస్కృతిక వేదికపై నిర్వహించిన సంగీతనృత్యకార్యక్రమాలు క్తులను మంత్రముగ్ధులను చేశాయి.


 సందర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 7.15 గంటల వరకు ఎస్వీ సంగీ నృత్య కళాశాల అధ్యాపకులుడామండా అనంతకృష్ణ బృందం “పిబరే రామరసం”, “ఆడమోడి గలదా”, “రఘువంశ సుధాంభుది”, “ఏతీరుగా నను”, “కరుణాజలధే”, “మీరా భజన్” వంటి కృతులను సుమధురంగా ఆలపించి భక్తులనుఆకట్టుకున్నారు.


అనంతరం రాత్రి 7.15 గంటల నుండి 8.30 గంటల వరకు జరిగిన భరతనాట్య నృత్య కార్యక్రమంలో ఎస్వీసంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ సిహరినాథ్ బృందం “మేలుకో వయ్య”, “శరణు శరణు నీకు”, “పెరిగి నాడు చూడరో”, “దేవ దుందుభుల తోడ”, “ఎరుట ఎవ్వరు లేరు”, “అంబా శాంభవి”, “వాసుదేవకమలాసన”, “కురై ఒండ్రుం ఇల్లై”, “చూడరమ్మ చెలురాల”, “శివరంజని”, “తిల్లానా” వంటి అంశాలతోనృత్య ప్రదర్శనలు ఇచ్చి భక్తులను అలరించారు.


 కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల ధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మాధుర్యంతో నింపాయి.

No comments:

Post a Comment