22.3.26

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం food analysis lab











ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు


 సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారున్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పాండా, సిఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ శ్రీ గిరిధర్ ల్యాబ్‌లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు.


తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ వనరుల నుంచి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది.


ప్రధాన కార్యకలాపాలు :


శ్రీవారి ప్రసాదంఅన్నప్రసాదం తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలను పరీక్షించడం.


ప్రతి నెల 1,000 నుండి 1,500 నమూనాలపై పరీక్షలు నిర్వహించడం.


ల్యాబ్ విస్తరణ :


ఆలయం అవసరాల మేరకు దేశం లోనే ఏర్పాటు చేసిన  తొలి అధునాతన ల్యాబ్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో (కోర్ ల్యాబ్‌కు రూ.25 కోట్లు-టంగ్/-నోస్‌కు రూ.3.5 కోట్లుపవర్ సెటప్‌కు రూ.1.10 కోట్లునిర్మించిన  12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.


 ల్యాబ్‌లో 6,000 చదరపు అడుగులు రసాయనాల విశ్లేషణకుమరో 6,000 చదరపు అడుగులు మైక్రో బయాలాజికల్ విశ్లేషణకు కేటాయించారు.


అత్యాధునిక పరికరాలు :


- GC/GC-MS : కొవ్వు ఆమ్లాలుపురుగుమందులువాయువీయ పదార్థాల పరీక్షలు.


- HPLC/LC-MS : మైక్రోటాక్సిన్లుఔషధాలుయాడిటివ్‌ల పరీక్షలు.


- AAS/ICP-MS : ఆహారం మరియు నీటిలో భారీ లోహా గుర్తింపు.


ఇతర పరికరాలలో ఫైబర్/ప్రోటీన్/ఫ్యాట్ అనలైజర్లుబ్యూటిరో రిఫ్రాక్టోమీటర్యూవీ-విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఉన్నాయి.


 కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రఅదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిపలువురు బోర్డు సభ్యులుజేఈవోలు శ్రీ వీరబ్రహ్మండాక్టర్ శరత్సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణహెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment