29.3.26

వేణుగానాలంకారంలో శ్రీ రామచంద్రమూర్తి అభయం lord srirama







ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.


ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగిందిభక్తజన బృందాలు చెక్క భజనలుకోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగామంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


ఉదయం 11 గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారుఇందులో పాలుపెరుగుతేనెచందనంతో స్వామిఅమ్మవార్లకు అభిషేకం చేశారు.


 కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతిఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్యఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment