22.3.26

మోహినీ అలంకారంలో కోదండరాముడు – ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిన భక్తులు mohini avatara











తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మూత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీరామచంద్రుడు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.


ఉదయం 8 గంటలకు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో  ఉత్సవం జరిగిందిభక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.


 మోహిని అలంకారంలో స్వామివారు నకు భక్తులు కానివారు  మాయాధీసులు కాక తప్పదనీతనకు ప్రసన్నులైనవారు మాయను సులభంగా దాటగలరనీ  మోహినీ రూపంలో ప్రకటిస్తున్నారు.


త‌రువాత ఉద‌యం 9.30 గంట‌ల‌కు గ‌రుడ‌ పాదుక‌ల ఊరేగింపు ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఘనంగా జ‌రిగిందిఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారుఇందులో పాలు, పెరుగుతేనెచందనంకొబ్బరి నీళ్లతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారురాత్రి 7 నుండి 11 గంటల వరకు గరుడసేవ అత్యంత వేడుకగా జరగనుంది.


వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌స్వామిఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్ఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment