3.3.26

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు teppotsavam







తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం  ఘనంగా ముగిశాయిచివరి రోజు శ్రీ లయప్పస్వామివారు శ్రీదేవిభూదేవి సమేతంగా తె‌ప్ప‌పై విహ‌రించి భక్తులకు కనువిందు చేశారు.


ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను శ్రీవారి నాలుగు మా వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారురాత్రి 7 గంటలకు విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను క‌టాక్షించారు


మంగళవాయిద్యాలు‌వేదపండితుల వేదపారాయ‌ణంఅన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.      


 తెప్పోత్సవంలో తిరుమ‌ల‌ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామిశ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం,    ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment