18.4.26

మే 1న శ్రీ కపిలేశ్వరాలయంలో పత్ర పుష్పయాగం pushpayagam




తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మే 1 తేదీన పత్ర పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారుఇందుకు ముందురోజు ఏప్రిల్ 30 తేదీ సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది.


మే 1 ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారుశ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంమహా పూర్ణాహుతికలశాభిషేకం నిర్వహిస్తారు సందర్భంగా పాలుపెరుగుతేనెపంచామృతంచెరకు రసంకొబ్బరి నీరువిభూతిపసుపుచందనం వంటి పవిత్ర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహిస్తారు.


ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం జరుగనుందిఇందులో చామంతిగన్నేరుమొగలిసంపంగిజాజిరోజాతామరమల్లికనకాంబరం వంటి పుష్పాలతో పాటు బిల్వ పత్రంతులసిపన్నీరు ఆకులతో స్వామిఅమ్మవార్లకు పత్ర పుష్పయాగం నిర్వహించనున్నారు.


సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశేఖర స్వామిన్మోహిని అమ్మవార్ల తిరువీధి ఉత్సవం భక్తులను అలరించనుంది.


లోకక్షేమం కోసమే కాకుండా ఆలయంలో అర్చకులుపరిచారకులుఅధికారులుభక్తుల వల్ల జరిగిన లోపాల నివారణార్థం పత్ర పుష్పయాగాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు.


No comments:

Post a Comment