తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 23వ తేదీన పవిత్రమైన పుష్పయాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 22వ తేదీ సాయంత్రం పుష్పయాగానికి అంకురార్పణ జరుగుతుంది.
ఏప్రిల్ 23న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్వామివారు, అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారికి వివిధ రకాల సువాసన పుష్పాలతో పుష్పయాగం నిర్వహించబడుతుంది.
తరువాత రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తారు.
ఈ పుష్పయాగంలో గృహస్తులు (ఇద్దరు) రూ.1,000/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి పాల్గొనవచ్చు.
శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మార్చి 17 నుండి 25 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగిన విషయం విదితమే. ఆ బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగం ద్వారా సమస్త దోషాలు తొలగి, లోకక్షేమం కలుగుతుందని అర్చకులు తెలిపారు.
No comments:
Post a Comment