కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 29 నుండి మే 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారు, అమ్మవారు ఆలయ పుష్కరిణిలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఉత్సవాల వివరాలు:
ఏప్రిల్ 29 – శ్రీ కృష్ణ సమేత గోదాదేవి 3 చుట్లు
ఏప్రిల్ 30 – శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు 5 చుట్లు
మే 1 – శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు 7 చుట్లు
ఈ మూడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
అదేవిధంగా, టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి.
No comments:
Post a Comment