శ్రీ
రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ తెలిపారు.
టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో మూడు రోజుల పాటు జరిగిన అవతార మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.
ఈ సందర్భంగా రామానుజాచార్యులు భక్తి మార్గాన్ని ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చిన మహానుభావుడని పేర్కొన్నారు. ఆయన బోధనలు దేశవ్యాప్తంగా విస్తరించాయని తెలిపారు.
అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రాజ్యలక్ష్మీ బృందం ఆలపించిన సంకీర్తనలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment