తిరుపతి
రామచంద్ర పుష్కరిణిలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీకోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.
ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగానిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో స్వామి, అమ్మవార్లఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు.
అనంతరం సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు ఆలయం నుండిబయల్దేరి రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. విద్యుద్దీపాలు, పుష్పాలతోఅందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగిభక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
తెప్పోత్సవం అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
తెప్పోత్సవంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment