29.4.26

శ్రీ వేద నారాయ‌ణ స్వామివారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం vedanarayanaswmay vari temple





నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఆల‌యంలో కోయిల్ ళ్వార్ తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరిగిందిఆలయంలో మే 1 నుండి 9 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమేబ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.


 సంద‌ర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చ‌నశుధ్ధి నిర్వహించారుఅనంతరం ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12 గంటల‌ వరకు కోయిల్‌ ళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారుఇందులో ఆలయ ప్రాంగణంగోడలుపైకప్పుపూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపుశ్రీచూర్ణంకస్తూరి పసుపుపచ్చాకుగడ్డ కర్పూరంగంధం పొడికుంకుమకిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారుఅనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.


 కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగ‌ర‌త్న‌టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ శ్రీ‌నివాసులుశ్రీ చెంగ‌ల్రాయులుఆల‌య‌ అర్చకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment