2.5.26

శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాలలో 2026–27 అడ్మిషన్లు ప్రారంభం


సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళను సంరక్షిస్తూభవిష్యత్ తరాలకు అందించడంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు విశిష్ట సేవలందిస్తోంది క్రమంలోతిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పకళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.


సంవత్సరాల డిప్లొమా కోర్సు మరియు 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సులకు మే 04 తేదీ నుంచి జూన్ 20 తేదీ వరకు దరఖాస్తులను జారీ చేసిస్వీకరించనున్నారుపదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చుఅభ్యర్థులు దరఖాస్తులను కళాశాలలో నేరుగా పొందవచ్చు లేదా టిటిడి వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసిన దరఖాస్తులను జూన్ 20 తేదీ  సాయంత్రం లోపు అందజేయాలి. 


ప్రవేశం పొందిన విద్యార్థుల పేరిట టిటిడి రూ.1 లక్షను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేసికోర్సు పూర్తి చేసిన తరువాత నిబంధనల ప్రకారం వడ్డీతో సహా అందజేస్తుంది.


శిల్పకళాశాల విశిష్టత


1960లో స్థాపించబడిన  శిల్పశిక్షణ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏకైకంగా నిలిచిభారతీయ సాంప్రదాయ ఆలయ నిర్మాణంవాస్తుశిల్పకళలో నైపుణ్యంతో కూడిన శిల్పులను తీర్చిదిద్దుతోందిభారతీయ సంస్కృతివారసత్వ పరిరక్షణలో విద్యార్థులను మార్గనిర్దేశం చేస్తోంది.


కోర్సుల వివరాలు

డిప్లొమా ఇన్ ట్రెడిషనల్ స్కల్ప్చర్ (4 సంవత్సరాలు)


రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ మరియు ఏఐసిటిఈ అనుమతితో నిర్వహించే  కోర్సులో 6 విభాగాలు ఉన్నాయి:


ఆలయ నిర్మాణం

శిలా శిల్పం

సుధా శిల్పం

లోహ శిల్పం

కొయ్య శిల్పం

సంప్రదాయ వర్ణచిత్ర లేఖనం


ప్రతి విభాగంలో సంవత్సరానికి 10 మంది చొప్పునమొత్తం 60 మందికి ప్రవేశం కల్పిస్తారువిద్యార్థులకు ఉచిత వసతిభోజన సౌకర్యం అందుబాటులో ఉంటుందిచివరి సంవత్సరం విద్యార్థులకు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శన కూడా కల్పిస్తారు.


సంప్రదాయ కలంకారి కళ (2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు)


వస్త్రాలపై సంప్రదాయ చిత్రకళలో శిక్షణనిచ్చే  కోర్సులో ప్రతి సంవత్సరం 10 మందికి ప్రవేశం కల్పిస్తారుఉచిత వసతిభోజనంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉన్నాయిదేశ విదేశాల్లో లంకారి కళకు మంచి డిమాండ్ ఉంది.


ప్రవేశ విధానం


రాష్ట్ర ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందిఅర్హులైన అభ్యర్థులు మే 04 నుండి జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఉపాధి అవకాశాలు


 సంస్థలో శిక్షణ పొందిన వారు టిటిడి ఆలయ నిర్మాణపునర్నిర్మాణ విభాగాల్లో స్థపతులుటెక్నికల్ అసిస్టెంట్లుకాంట్రాక్టర్లు దేవాదాయపర్యాటకపురావస్తు శాఖల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.  అంతేకాకజాతీయ స్థాయిలో నేక అవార్డులు అందుకుంటున్నారు.


ఇతర వివరాలకు


శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థ

తిరుమల తిరుపతి దేవస్థానములులిపిరి రోడ్తిరుపతి – 517507

వెబ్‌సైట్www.tirumala.org

ఫోన్: 0877-2264637

No comments:

Post a Comment